Chilkur Balaji Temple:108 ప్రదక్షిణల వెనుక ఉన్న అసలు కథ ఇదే..


కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు ఏడుకొండల పై కొలువై ఉన్నాడు. శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వెళుతుంటారు. అయితే శ్రీనివాసుని దేవాలయాలు తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామంలోనూ ఉంటాయి. ఆయా దేవాలయాలకు స్థల ప్రాశస్యాన్ని బట్టి మహిమలు కలిగి ఉంటాయి. సరిగా అలాంటి స్థల ప్రాశస్త్యంతో మహిమగల దేవుడే చిలుకూరు బాలాజీ స్వామి. ఇక్కడ శ్రీనివాసుడిని వీసా దేవుడు అని పిలుస్తారు. కోరిన కోరికలను తీర్చే శ్రీనివాసుడిని ప్రత్యేకంగా వీసాల దేవుడు అని ఎందుకు పిలుస్తారు అని సందేహం మీకు కలగవచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిమంది అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళుతుంటారు. అక్కడే వారు ఉద్యోగ విద్యా ఉపాధి కోసం వెతుక్కుంటారు. అమెరికా వెళ్లేందుకు ఎక్కని మెట్టు మొక్కని మొక్కు అనేది ఉండదు. అయితే చిలుకూరు బాలాజీ స్వామిని అమెరికా వీసా కావాలని మొక్కి 11 ప్రదక్షిణాలు చేసి ఆ తరువాత వీసా వచ్చిన అనంతరం 108 ప్రదక్షిణాలతో మొక్కు తీర్చుకోవాలని అక్కడి దేవాలయ పండితులు చెబుతున్నారు.

balaji temple

108 ప్రదక్షిణల వెనుక ఉన్న అసలు కథ ఇదే..

తెలుగు రాష్ట్రాల్లో అమెరికాకు వెళ్లాలనే ట్రెండు ప్రారంభం అయ్యాక చిలుకూరు బాలాజీ స్వామి గుడికి వచ్చే భక్తుల తాకిడి కూడా పెరిగింది ఇక్కడికి వచ్చే భక్తులకు త్వరగా వీసాలు లభిస్తున్నాయని ఆ నోట ఈ నోట ప్రచారం కలగడంతో పెద్ద ఎత్తున భక్తులు రావడం ప్రారంభించారు. కేవలం అమెరికా వీసా మాత్రమే కాదు తమ కోరిన కోరికలు తీర్చమని స్వామి వారిని వేడుకునేందుకు ప్రతిరోజు వేలాది మంది ఇక్కడకు వచ్చి మొక్కుకొని 11 ప్రదక్షిణాలు చేసి వెళ్తుంటారు. దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. .

దేవాలయ అర్చకులు సౌందర్ రాజన్ తెలిపిన విశేషాల ప్రకారం సరిగ్గా 20 ఏళ్ల క్రితం తమ దేవాలయంలో ఒక బోరు వేస్తుండగా ఎంతకీ నీళ్లు పడలేదని దీంతో తమ సోదరుడు స్వామి వారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండగా 11వ ప్రదక్షిణ వద్ద బోరు నీరు పడాలని కోరుకోగా వెంటనే నీరు బయటకు వచ్చిందని అంతా స్వామివారి దయగా భావించిన ఆ పురోహితుడు 108 ప్రదక్షిణలు చేసి స్వామివారి ముక్కు చెల్లించుకున్నట్లు సౌందర్ రాజన్ తెలిపారు. అప్పటినుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఇక్కడ మొదట 11 ప్రదక్షిణలు చేసి తమ కోరిక తీర్చమని స్వామివారిని మొక్కుకొని ఆ కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు వచ్చి చేస్తారు. అయితే ఎవరైతే ఏకబిగిన 108 ప్రదక్షిణాలు చేయలేరో… వారు విడతల వారీగా ప్రతి శనివారం వచ్చి ప్రదక్షిణాలు చేస్తూ 108 పూర్తి చేయవచ్చని స్వామి వారు తెలిపారు.

Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros