బంగారం ప్రియులకు గుడ్ న్యూస్! …ఆ దేశంలో అతి తక్కువ ధరకే బంగారం, వీసా లేకుండానే వెళ్లి రావచ్చు..


బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.పెళ్లీళ్ల సీజన్‌లో బంగారం ధరలు చుక్కలనంటుతున్నాయి.అయితే ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకే లభించే ఓ దేశం గురించి తెలుసా…. బంగారం తక్కువ ధరకే లభిస్తుందనగానే,గల్ఫ్ దేశాలు చాలా మందికి గుర్తొస్తాయి. అయితే భూటాన్ దేశంలో ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు బంగారం లభిస్తుంది. అంతే కాదు అక్కడ కొనుగోలు చేసే బంగారంపై ఎలాంటి పన్నులు కూడా ఉండవు.

gold low price

భూటాన్‌లో బంగారం ధర ఎందుకు అంత తక్కువ?

భూటాన్ దేశంలో పసిడిపై అసలు పన్నులు విధించరు. అంతే కాదు ఈ దేశంలో బంగారం వంటి లోహాల దిగుమతిపై సుంకాన్ని చాలా తక్కువగా వసూలు చేస్తుంది. దీంతో భూటాన్‌లో బంగారంపై ఎలాంటి టాక్స్ లేదని చెప్పవచ్చు.

భారతీయులు, భూటాన్ వెళ్లి బంగారం కొనవచ్చా?

భూటాన్ దేశంలో ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు బంగారం లభిస్తుంది. భారతదేశంతో పోలిస్తే ఇక్కడ బంగారం చాలా తక్కువ ధరకే లభిస్తుంది. భారతీయులు వెళ్లి సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు.

భూటాన్‌కు వీసా అవసరం లేదా?

భూటాన్ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు ఎలాంటి వీసా అవసరం లేదు. 1949లో ఇండియా-భూటాన్ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా భారతీయులు ఎలాంటి వీసా అవసరం లేకుండా ప్రయాణించవచ్చు.

భూటాన్ నుండి భారతదేశానికి బంగారం తీసుకురావడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. “సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు అండ్ కస్టమ్స్” నిబంధనల ప్రకారం, భారతదేశానికి చెందిన పురుషులు 50 వేల రూపాయల విలువైన బంగారం తీసుకురావచ్చు. స్త్రీలు లక్ష రూపాయల విలువైన బంగారం ఇండియాకు తీసుకురావచ్చు. నిబంధనలకు లోబడి బంగారం కొనుగోలు చేస్తే, ఆ బంగారానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

భూటాన్‌లో బంగారం కొనాలంటే పాటించాల్సిన నిబంధనలు ఇవే!

– భూటాన్‌లో బంగారం కొనాలంటే భూటాన్ దేశం విధించే సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఫీజును చెల్లించాలి. భారతీయులకు సుమారుగా రూ.1200 నుంచి రూ.1800 వరకు ఉంటుంది.

– భూటాన్ ప్రభుత్వం గుర్తింపు పొందిన టూరిస్ట్ సర్టిఫైడ్ హోటల్‌లో కనీసం ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుంది.

– భూటాన్ వెళ్లే పర్యటకులు అమెరికన్ డాలర్లతో బంగారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

భూటాన్‌లో తక్కువ ధరలకే బంగారం అందుబాటులో ఉంటుంది. భూటాన్ నుండి భారతీయులు బంగారాన్ని దుబాయ్ కంటే 5 శాతం నుంచి 10 శాతం తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros