Good Morning quotes in Telugu: ఉదయాన్నే మీలో స్పూర్తిని నింపే గుడ్ మార్నింగ్ కొటేషన్స్…మీకిష్టమైన వారితో పంచుకోండి!


ప్రతి రోజు ఉదయాన్ని కొత్త ఆలోచనలతో ప్రారంభించాలి. దీని వలన రోజులో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పాజిటివ్ ఆలోచనలతో రోజును ప్రారంభించేందుకు మంచి స్పూర్తిని కలిగించే సందేశాలు, కొటేషన్స్ మీకిష్టమైన వారితో పంచుకోండి…

good morning

గుడ్ మార్నింగ్ కొటేషన్స్ తెలుగులో…..

” జీవితంలో ఎప్పుడూ అదృష్టాన్నే నమ్ముకోవద్దు… కేవలం అదృష్టం ఒక్కటే సరిపోదు, అనుకున్నది సాధించేందుకు కష్టపడాలి! అప్పుడే గెలుపు మీ సొంతమవుతుంది! “

” నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది.. దాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొదలైతే చాలు, ప్రతీ సమస్యా నీకు చిన్నదిగానే కనిపిస్తుంది. “

” ప్రయత్నించడంలో ఎప్పుడూ ఓడిపోకూడదు. ప్రయత్నం మిమ్మల్ని తదుపరి విజయానికి దగ్గరచేస్తుంది. శుభోదయం! “

” బంధాలను కలుపుకోవడం మాత్రమే కాదు, వాటిని నిలుపుకోవడంలో గొప్పతనం ఉంది. శుభోదయం! “

” లక్ష్యసాధన కోసం నువ్వు చేసే ప్రయత్నం ఎప్పుడూ వదులుకోకు…నీ బలం, బలహీనతలను గుర్తించాలి. గుడ్ మార్నింగ్! “

“ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించు…అప్పుడు ఈ ప్రపంచంలో నీకంటే అందంగా ఎవ్వరూ కనిపించరు.. శుభోదయం! “

” జీవితంలో కొన్ని ప్రశ్నలకు, కొన్ని సందర్భాలకు కష్టమే సరైన సమాధానం. శుభోదయం! “

” ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యలను సులభంగా తగ్గించగలిగే శక్తి…మీ చిరునవ్వుకు ఉంది. గుడ్ మార్నింగ్ !”

” మెరుగుపెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు..శుభోదయం! “

” ఎదుటి వారిలో కోపాన్ని, లోపాన్ని భరించేవారే నిజమైన స్నేహితులు…శుభోదయం! “

” కష్టాలు నిన్ను భయపెట్టడానికి రాలేదు… జీవితంలో నీవు ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి… గుడ్ మార్నింగ్! “

” ఎవరో ఏదో చేస్తారని ఆలోచించకు.. మొదటి అడుగు నువ్వు వేస్తే జీవితంలో ఎదుగుదల నీ సొంతం అవుతుంది. గుడ్ మార్నింగ్ ! “

” దీపం కాంతి ఇంటిలో వెలుగును ఇస్తుంది.. మంచి ఆలోచన జీవితానికి దారిని చూపిస్తుంది… శుభోదయం! “

” ఎవరో ఏదో చేస్తారని ఆలోచించకు.. మొదటి అడుగు నువ్వు వేస్తే జీవితంలో ఎదుగుదల నీ సొంతం అవుతుంది.గుడ్ మార్నింగ్ ! “

” బలం అందరికీ ఉంటుంది కానీ సంకల్ప బలం కొందరికే ఉంటుంది అది ఉన్న వారు విజయాన్ని సాధించగలరు…శుభోదయం! “

” సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. గుడ్ మార్నింగ్ ! “

” భయపడటం ఎప్పుడు మానేస్తామొ అప్పుడే మన జీవితం మొదలైనట్లు. శుభోదయం! “

Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros