Live Updates of 19-02-2025


Update #6

*Income Tax forms DDO కి సబ్మిట్ చేసేటప్పుడు New Regime నందు చేసిన వారు Form 12BB ఇవ్వనవసరం లేదు*

*OLD REGIME నందు చేసిన వారు మాత్రమే ఖచ్చితంగా FORM12BB ఇవ్వాలి*


Update #5

🍄జాతీయ విద్యా విధానం లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యా నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు సింఘానియా గ్రూప్ (రేమండ్స్), ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య నా సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా సింఘానియా స్కూల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదట తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, విద్యా నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణతో పాటు… సాంకేతిక అనుసంధానం వంటి అంశాల్లో విద్యా నైపుణ్యాన్ని సాధించేందుకు పాఠశాలల నిర్వహణలో మార్పులు తీసుకురానున్నారు. ఐదేళ్ల వ్యవధిలో అమలుచేసే ఈ కార్యక్రమం ద్వారా 1 లక్ష మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు కూడా ట్రస్ట్ సేవలను విస్తరిస్తారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర విద్యారంగాన్ని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దడమే లక్ష్యం.

Update #4

3,4,5 తరగతుల విద్యార్థుల చేత ఇకనుండి CBA Material ను ప్రాక్టీసు చేపించాల్సి ఉంటుంది

వారానికోసారి ఉపాధ్యాయులు CBA ప్రాక్టీస్ మెటీరియల్ యూసేజ్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. Form Link👇

https://lfenew.surveycto.com/collect/cba_form?caseid=


Update #3

*Flash.. APSCERT CBA Practice Material for 3,4,5 Classes Released*
*▪️18 – 21, February CBA Practice Material Week-1*
*▪️Classes 3,4,5*
*
*✳️ముఖ్య ప్రకటన: 3-5 గ్రేడ్‌ల CBA ప్రాక్టీస్ మెటీరియల్ గురించి**

*ప్రియమైన ఉపాధ్యాయులారా,*

*SCERT నుండి శుభాకాంక్షలు!*

*18 ఫిబ్రవరి 2025న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 3-5 తరగతులకు CBA ప్రాక్టీస్ మెటీరియల్‌ని పరిచయం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము*. ఈ రిసోర్సెస్ విద్యార్థుల గణిత శాస్త్ర అవగాహనను బలోపేతం చేయడానికి మరియు 2023-24 తరగతి గది-ఆధారిత అసెస్‌మెంట్స్ (CBA)లో గుర్తించబడిన అభ్యాస అంతరాలను పరిష్కరించడానికి రూపొందించబడింది.

*ఇది విద్యార్థులకు ఏవిదంగా ఉపయోగపడుతుంది ఇస్తుంది:*
✅ CBA 2023-24లో గుర్తించబడిన అభ్యాస అంతరాలను తగ్గించడంలో సహాయపడటానికి 3, 4 మరియు 5 గ్రేడ్‌ల కోసం వీక్లీ ప్రాక్టీస్ మెటీరియల్‌లు అధికారిక WhatsApp సమూహాల ద్వారా అందజేయబడాయి.
✅ మెటీరియల్స్ స్టూడెంట్ – ఫ్రెండ్లీ గా ఉంటాయి-అవి కీలక భావనలను వివరిస్తాయి, ప్రాక్టీస్ ఎక్సర్సిస్ ను అందిస్తాయి మరియు అభ్యాసాన్ని బలోపేతం చేయడానికి 5 సాధారణ MCQలను కుడా కలిగి ఉంటాయి.

*ఉపాధ్యాయుల బాధ్యతలు:*
🎯 మీకు పంపిచిన వీక్లీ ప్రాక్టీస్ మెటీరియల్స్ (PDFలు) డౌన్‌లోడ్ చేసుకోండి.
🎯 ఇన్స్ట్రక్షన్ వీడియోను మరియు మెటీరియల్‌లను చూడండి .
🎯 తరగతిలో వీడియోను విద్యారతులకు చూపండి, భావనలను వివరించండి మరియు ప్రాక్టీస్ ఎక్సర్సిస్ ద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయండి.
🎯 మెటీరియల్‌లో అందించిన MCQలను ఉపయోగించి అస్సెస్స్మెంట్ నిర్వహించండి.
🎯 అస్సెస్స్మెంట్ లో విద్యార్థుల పనితీరు ఆధారంగా అభ్యాస అంతరాలను పరిష్కరించండి.

CBA ప్రాక్టీస్ మెటీరియల్ యొక్క వీక్లీ వినియోగాన్ని ప్లాన్ చేయడంలో ఉపాధ్యాయులకు మద్దతు ఇవ్వడానికి, ఉపాధ్యాయులు వారానికోసారి CBA ప్రాక్టీస్ మెటీరియల్ యూసేజ్ ఫామ్ ఫిల్ చేయమని అభ్యర్దిస్తున్నాము.

*📌 యూసేజ్ ఫామ్ ను కనుగొనడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి:* https://lfenew.surveycto.com/collect/cba_form?caseid=

ఇంప్లిమెంటేషన్ కోసం సపోర్ట్ చేయడానికి , మేము మీ తరగతి గదుల్లో ఈ విషయాన్ని ప్రభావవంతంగా ఉపయోగించడం కోసం లక్ష్యాలు మరియు ఉత్తమ పద్ధతులను వివరించే టీచర్ ఓరియంటేషన్ వీడియోను షేర్ చేస్తున్నాము.

*📌 ఇక్కడ టీచర్ ఓరియంటేషన్ వీడియో చూడండి:* https://youtu.be/qKXMltwcO5Q

మేము ఈ మెటీరియల్‌లను వారి పాఠాల్లోకి చేర్చమని మరియు రాబోయే CBAలో విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి వీడియోలో చూపించిన స్ట్రాటజీస్ ను ఇంటిగ్రేట్ చేయమని ఉపాధ్యాయులందరినీ ప్రోత్సహిస్తాము.

*నాణ్యమైన విద్య పట్ల మీ అంకితభావానికి ధన్యవాదాలు!

శుభాకాంక్షలు,
SCERT


Update #2

##స్కూల్ అసెంబ్లీ న్యూస్ 19 ఫిబ్రవరి 2025

 

💠 అంతర్జాతీయ వార్తలు::*

 

📌ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు బృందాలను నియమించాలని అమెరికా, రష్యా నిర్ణయించాయి.

 

📌కశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని భారత్ ను కోరుతూ పాక్ తీర్మానం చేసింది.

 

💠 *జాతీయ వార్తలు:*

 

📌భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనను నియమించిన చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

 

📌మరో 5-6 నెలల్లో భారత్లో మహిళలకు క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. 9-16 ఏళ్ల బాలికలు వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు.

 

📌యూట్యూబ్, సోషల్ మీడియా కంటెంట్ను నియంత్రించాలని సుప్రీంకోర్టు కోరింది.

 

💠 *రాష్ట్ర వార్తలు:*

 

📌ఖరీఫ్ లో 32 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ఏపీ వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

 

📌 విద్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు సింఘానియా స్కూల్ ట్రస్ట్ తో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది.

 

💠 *క్రీడా వార్తలు:*

 

📌ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో పాకిస్థాన్ తలపడనుంది.


Update #1

*బురద చల్లకండి*

*అది మీరు ఉద్దేశించిన వారిపై*

*పడకపోవచ్చు కానీ,మీ చేతులు మాత్రం బురద అవుతాయి*

*బలవంతుడవని విర్ర వీగడం* *మానుకో ఒకరిని నలుగురు మోస్తే గాని*

*వెళ్లలేవని తెలుసుకో*


Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros