Live Updates of 20-02-2025


Update #5

*Morning Top9 News*

 

ఢిల్లీ కొత్త సీఎంగా మ.12:35కి రేఖాగుప్తా ప్రమాణం

ఢిల్లీలో CM చంద్రబాబు.. మధ్యాహ్నం అమిత్‌ షాతో భేటీ

ఎన్నికల కోడ్‌తో తెలంగాణలో CMRF చెక్కులకు బ్రేక్

తెలంగాణలో రెండోరోజు సునీల్ బన్సల్ పర్యటన

ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని వైఎస్ జగన్‌పై కేసునమోదు

నాగార్జునసాగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అగ్నిప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్,నలుగురు మావోయిస్టుల మృతి

రష్యాపై మరిన్ని ఆంక్షలకు యూరోపియన్ యూనియన్ చర్యలు

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై న్యూజిలాండ్ విజయం


Update #4

నేడు ఢిల్లీ కొత్త సీఎంగా రేఖాగుప్తా ప్రమాణం

మధ్యాహ్నం 12:35కి రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం

సీఎంతో పాటు ప్రమాణం చేయనున్న ఆరుగురు మంత్రులు

ఢిల్లీ తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా

ఢిల్లీ నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా

హాజరుకానున్న ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు..

ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు

30 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు

రామ్‌లీలామైదానంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత


Update #3

మరోసారి ఆల్‌టైం హైకి బంగారం ధర

రూ.89 వేలు దాటిన 10 గ్రాముల బంగారం

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,070

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,480

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.99,700


Update #2

సమగ్ర శిక్షా ఆంధ్రప్రదేశ్

స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు ఏపీ నుంచి 76 ప్రాజెక్టులు ఎంపిక

– విద్యార్థులు, టీచర్లను అభినందించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి శ్రీనివాసరావు

స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ (SIM)

భారతదేశంలోని విద్యార్థుల కోసం, దేశంలోనే అతిపెద్ద పాఠశాల స్థాయి ఇన్నోవేషన్ పోటీగా స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ (SIM) ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM), నీతి ఆయోగ్, మౌలిక విద్యా మంత్రిత్వ శాఖ (MIC) సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీ ద్వారా విద్యార్థులు తమ పరిసరాల్లోని సామాజిక సమస్యలను గుర్తించి, వాటికి వినూత్నమైన పరిష్కారాలను రూపొందించేందుకు అవకాశం కల్పించబడింది. ఈ ప్రాజెక్టులను వర్కింగ్ ప్రోటోటైప్ రూపంలో అభివృద్ధి చేస్తారు. SIM లో టాప్ ప్రాజెక్ట్స్‌కు కేంద్ర ప్రభుత్వ నుంచి నిధులు లభిస్తాయి.

ఈ పోటీ 2024 జూలై 29న అధికారికంగా ప్రారంభమైంది. ఆగస్టు 1 నుండి డిసెంబర్ 15, 2024 వరకు ఇన్నోవేషన్ & ప్రోటో టైపింగ్ దశ కొనసాగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పోటీలో 5443 పాఠశాలలు పాల్గొని, 21,625 టీమ్స్ ఏర్పడ్డాయి. మొత్తం 61,027 మంది విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యారు. రాష్ట్రం నుండి 8748 వినూత్న ఆలోచనలు (ఐడియాలు) సమర్పించారు. వీటిలోని అత్యుత్తమ 76 ప్రాజెక్ట్స్‌ను మౌలిక విద్యా మంత్రిత్వ శాఖ, AICTE, UNICEF, AIM కలిసి ఎంపిక చేశాయి. ఈ ఎంపికైన ప్రాజెక్టులకు స్టూడెంట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ (SIP) ద్వారా మరింత అభివృద్ధికి ఆర్థిక మద్దతు అందజేస్తారు.

*విద్యార్థుల క్రియాశీలతపై ప్రత్యేక ప్రశంసలు*

సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి. శ్రీనివాస రావు, IAS గారు ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రశంసించారు. విద్యార్థుల సృజనాత్మకత, వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం కల్పించడంలో ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు.

*అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల (ATL) అభివృద్ధి పై దృష్టి*

ATL కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. UNICEF, దాని సాంకేతిక భాగస్వామి విజ్ఞాన్ ఆశ్రమ్ అందిస్తున్న మద్దతును ఆయన

కొనియాడారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేకంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లు, హబ్ అండ్ స్పోక్ విధానంలో ఉపాధ్యాయులకు మెళకువలపై శిక్షణ ఇచ్చి, విద్యార్థులలో విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్యార్థులు తమ ఆలోచనలను ఆవిష్కరించడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వేషించడానికి, వారి ఆలోచనలను ప్రామాణిక ప్రాజెక్టులుగా రూపాంతరం చేసుకునేలా ATL ల్యాబ్‌లను పూర్తి స్థాయి ఇన్నోవేషన్ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఎస్పీడీ తెలిపారు.


Update #1

*స్కూల్ అసిస్టెంట్లను 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఇన్విజిలేటర్స్ గా నియమించాలంటూ ఆదేశాలు*

*10వ తరగతి 3450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు-సిబ్బంది నియామకం కఠిన నిబంధనలు జారీ*

*అదనంగా అవసరం ఉంటేనే ఎస్జీటీలను నియమించుకోవాలి*

*ప్రతి 20 మందికి ఒక ఇన్విజిలేటర్…*

*తాజా మార్గదర్శకాలు ఉత్తర్వులు దిగుమతి చేసుకోగలరు*

SSC, OSSC & SSC Vocational Course Public Examinations, March – 2025 Constitution of centers for Regular and Private Candidates Forwarding the list of Approved Centers and Examination Zones.


Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros