Live Updates of 24-02-2025


Update #2

*నేటి వార్తలు(24.02.2025)*

 

*నేటి ప్రత్యేకత:*

▪️Central Excise Day సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖను భారత ప్రభుత్వం 1944 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభించింది.

▪️National Tortilla Chip Day

 

*అంతర్జాతీయ వార్తలు::*

▪️అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలహరిస్ శనివారం రాత్రి ప్రతిష్టాత్మక నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ (ఎన్ ఏ ఏ సి పి) అందించే చైర్మన్స్ అవార్డును లాస్ ఏంజెలెస్ లో స్వీకరించారు.

▪️పాకిస్తాన్, బాంగ్లాదేశ్ దేశాలు 1971 తర్వాత తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకున్న సందర్భంగా 50 వేల టన్నుల బియ్యంతో కరాచీలోని పోర్టు కాసిం నుంచి తొలి సరుకు రవాణా నౌక బంగ్లాదేశ్ కు బయలుదేరింది.

▪️రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా రష్యా శనివారం రాత్రి 267 డ్రోన్లతో ఉక్రెయిన్ పై దాడులు చేసింది.

▪️జర్మనీ పార్లమెంటు ఎన్నికలలో ప్రతిపక్షనేత ఫ్రెడ్రిక్ మెర్జ్ కు చెందిన సాంప్రదాయవాదుల (సిడి యు/సి ఎస్ యు ల కూటమి) విజయం ఖాయం కావడంతో తదుపరి చాన్సర్ గా ఫ్రెడ్రిక్ మెర్ట్ ఎన్నిక కానున్నారు.

▪️పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగానే ఉందని అయితే ఆయన స్పృహలోనే ఉన్నారని వాటికన్ నిన్న వెల్లడించింది.

▪️2021 మార్చిలో ఆఫ్ఘనిస్తాన్ లో ప్రారంభమైన మహిళలు నడుపుతున్న రేడియో “రేడియో బేగం” విధించిన నిషేధాన్ని అధికార తాలిబాన్ ప్రభుత్వం ఎత్తివేసింది.

▪️అమెరికా అధ్యక్షుడు అమలు చేస్తున్న అక్రమ వలసదారుల ను గెంటివేసే విధానాన్ని వ్యతిరేకించే ఉద్యోగులకు జైలు శిక్ష జరిమానా విధిస్తామని అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు హెచ్చరించాయి.

▪️హమాస్ ఇజ్రాయిల్ ఒప్పందంలో భాగంగా గురువారంనాడు హమాస్ ఆరుగురు బందీలను విడుదల చేయగా, దీనికి బదులుగా ఇజ్రాయిల్ 600కు పైగా పాలస్తీనా ఖైదీలను విడిచి పెట్టాల్సి ఉండగా వారి విడుదలను నిరవధికంగా ఆలస్యం చేస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.

▪️బాంబు బెదిరింపు రావడంతో అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన న్యూయార్క్ – న్యూఢిల్లీ విమానాన్ని నిన్న రోమ్ కు మళ్ళించినట్లు అమెరికన్ ఎయిర్లైన్స్ సంస్థ తెలియజేసింది.

 

*జాతీయ వార్తలు:*

▪️మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పరిష్కరించుకుని తన సోషల్ మీడియా అకౌంట్లో వివిధ రంగాలలో విజయాలు సాధించిన మహిళా ప్రముఖులకు అప్పగించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలవారి మన్ కీ బాత్ కార్యక్రమంలో వెల్లడించారు.

▪️ఈ బడ్జెట్ లో హామీ ఇచ్చినట్లుగా వచ్చే 3 సంవత్సరాలలో దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రులలో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌలిక వసతులపై కేంద్ర ప్రభుత్వం సర్వేను ప్రారంభించింది.

▪️ఇప్పటివరకు మహా కుంభ మేళాలో 62 కోట్ల మంది పాల్గొన్నారని, ఇది ఈ శతాబ్దపు అరుదైన సంఘటన అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ ప్రకటించారు.

▪️ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కాల్ కాజీ నియోజకవర్గ శాసనసభసభ్యురాలు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అతిశీ ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు.

▪️నిన్న భోపాల్ లో “ఇన్వెస్ట్ ఇన్ మధ్యప్రదేశ్ – గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2025″ పేరుతో జరిగిన ప్రపంచ మదుపరుల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రారంభించారు.

జేఈఈ మెయిన్ పేపర్ -2 తొలి విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ నిన్న విడుదల చేసింది.

▪️సరికొత్త ఆలోచనలు నూతన ఆవిష్కరణలకు ఉద్దేశించిన అంతర్జాతీయ వేదిక “బయో ఆసియా – 2025″ 25, 26 తేదీలలో హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో జరగనుండగా ఇందులో 50 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు హాజరవుతారు.

▪️సరైన పత్రాలు లేని వలసదారులను అమెరికా నుంచి వెనక్కి పంపిస్తున్న క్రమంలో 12 మంది భారతీయులు ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు.

▪️ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థలలో సేవలు అందిస్తున్న మహిళా శాంతి పరిరక్షకుల సేవలను గుర్తించడమే లక్ష్యంగా ఢిల్లీలో నేడు రేపు అంతర్జాతీయ సదస్సు జరగనుంది.

▪️అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ప్రతి కేసులోనూ ప్రాథమిక విచారణ నిర్వహించడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తెలియజేసింది.

 

*రాష్ట్ర వార్తలు:*

▪️శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానుండగా ఈరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

▪️రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిర్వహించిన గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగియగా 92 శాతం మంది హాజరైనట్లు అధికారులు తెలియజేశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని వెబ్ సైట్ లో ఉంచినట్లు ఈనెల 25 నుంచి 27 లోపల అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

▪️నేటి నుండి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగింది.

▪️రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ లో ఖాళీగా ఉన్న పోస్టులను సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేయనున్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలియజేశారు.’

▪️శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మ నిన్న ఢిల్లీలో కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా పరంపరాగత్ అవార్డును అందుకున్నారు.

▪️వేడి వాతావరణం కారణంగా రాష్ట్రంలో ఫిబ్రవరి మూడో వారానికి విద్యుత్ డిమాండ్ 242.35 మిలియన్ యూనిట్లకు చేరిందని విద్యుత్ శాఖ తెలియజేసింది.

▪️తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో శనివారం నాడు పైకొప్పు కూలడంతో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీ ఇంతవరకు తెలియలేదు.

 

*క్రీడా వార్తలు*

▪️అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 9వ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ పోటీల లో భాగంగా నిన్న దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు పాకిస్తాన్ జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. నేడు రావల్పిండి లో జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ న్యూజిలాండ్ జెట్లు తలపడనున్నాయి.

▪️భారత క్రికెట్ స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా నిన్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి 2024 సంవత్సరానికి గాను ” క్రికెటర్ ఆఫ్ ది ఇయర్”, “టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్” అవార్డులను అందుకున్నాడు.


Update #1

*జేఈఈ మెయిన్*

*ఫలితాలు విడుదల*

 

*జేఈఈ మెయిన్ పేపర్-2 (BArch&B.Planning) ఫలితాలను NTA విడుదల చేసింది.*

 

*జనవరిలో జరిగిన ఈ పరీక్షలకు 62,740 మంది హాజరయ్యారు.*

 

*BArchలో మహారాష్ట్రకు చెందిన నీల్ సందేశ్, B.Planningలో మధ్యప్రదేశ్కు చెందిన సునిధి సింగ్ 100 పర్సంటైల్ సాధించారు.*

 

వెబ్సైటు

*https://jeemain.nta.ac.in/*


Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros