రైతులకు శుభవార్త.ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సాహిస్తూ సబ్సిడీపై మొక్కలు, ఎరువులు మరియు డ్రిప్ యూనిట్ ప్రభుత్వం అందిస్తోంది.ఆయిల్ పామ్ సాగు మరియు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాల గురించి తెలుసుకుందాం…

ఆయిల్ పామ్ సాగు….
ఆయిల్ పామ్ మొక్కలు నాటడం ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి పొందవచ్చు. మొక్కలు నాటిన నాలుగు సంవత్సరాల నుండి గింజలు రావడం మొదలవుతుంది. 4 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు పంట వస్తుంది. ఒక ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. ఒక్కో టన్ను ఆయిల్ పామ్ గెల ధర సుమారుగా రూ.10వేలు ఉంటుంది. ఒక సంవత్సరానికి ఎకరానికి రూ.1.25 లక్షల దిగుబడి వస్తుంది.
ప్రభుత్వ సబ్సిడి ఎలా పొందాలి?
ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ఆసక్తి కలిగిన రైతులు స్థానిక ఉద్యానశాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
ఎంత సబ్సిడీ వస్తుంది?
ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ఆసక్తి గల రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్ మరియు మొక్కలు అందిస్తారు. బీసీ రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు మరియు మొక్కలు ఇస్తారు.
అంతర పంటలకు సాయం…
ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు అంతరపంటల సాగు కోసం ఎకరానికి 4200 రూపాయలను 4 సంవత్సరాల పాటు అందిస్తుంది.
మార్కెట్‌లో రూ.193 ఉన్న ఆయిల్ పామ్ మొక్కలను సబ్సిడీపై రైతులకు కేవలం రూ.20 కే రైతులకు సప్లై చేస్తుంది. డ్రిప్ యూనిట్ ఖర్చులో ఎస్సీ,ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం మరియు ఇతరులకు 80 శాతం సబ్సిడీగా అందిస్తోంది.
ఆయిల్ పామ్‌తో అధిక లాభాలు
వాణిజ్య పంటగా ఆయిల్ పామ్ సాగు రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుంది. వరి, పత్తిపంటలతో పోల్చితే రైతులకు తక్కువ పెట్టిబడి, శ్రమతో ఎక్కువ లాభాలు పొందవచ్చు.
ఒక్కసారి నాటితే 30 ఏళ్ల పాటు దిగుబడి
ఆయిల్ పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. నాలుగు సంవత్సరాల నుండి రైతులు పంట చేతికి వస్తుంది.మొదటి 3 సంవత్సరాలు అంతరపంటలు సాగు చేసుకోవచ్చు. ఆయిల్ పామ్ సాగుతో ఒక్కో ఎకరానికి కనీసం 10 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.
విదేశాల నుంచి పామాయిల్ దిగుబడిని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సాహిస్తున్నాయి. 2025-26 నాటికి విదేశాలపై ఆధారపడకుండా ఇండియాలోనే పామాయిల్ ఉత్పత్తి చేసే లక్ష్యంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సాహిస్తున్నారు.