Papaya Leaf Benefits: బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఖనిజాలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే బొప్పాయి ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం వీటిని తీసుకోవడం వల్ల మనసుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

Papaya Leaf Benefits: బొప్పాయి పండులో మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు మరియు బయో యాక్టివ్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయి ఆకుల్లో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయి ఆకులను జ్యూస్‌గా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బొప్పాయి ఆకులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి మరియు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మరియు కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాదు, బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సీ, మరియు విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉంటాయి. బొప్పాయి ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి ఆకుల్లో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ మరియు జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వారంలో మూడు రోజులు ఉదయం పరగడుపున బొప్పాయి ఆకు రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుండెకు మేలు చేస్తుంది
బొప్పాయి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మరియు విటమిన్ ఇ ఉన్నాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నివారిస్తాయి మరియు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. బొప్పాయి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు మరియు డయాబెటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు.
జీర్ణక్రియకు సహాయపడుతుంది
బొప్పాయి ఆకులు పేగు ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. ఇది కడుపులో అజీర్తి, గ్యాస్ తొలగించి మలబద్దక సమస్యకు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది ప్రోటీన్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ ఎంజైమ్ జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఆస్తమాకు ఉపశమనం
బొప్పాయి ఆకుల జ్యూస్ ఆస్తమాకు కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే శోథ నిరోధక గుణాలు ఫ్లేవనాయిడ్స్‌తో కలిసి ఇన్ఫ్లమేషన్ సమస్యను తగ్గిస్తాయి.
కాలేయానికి రక్షణ
బొప్పాయి ఆకులు కాలేయాన్ని శుభ్రపరుస్తాయి మరియు శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. అంతేకాదు, ఇది కాలేయ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.
చర్మ సంరక్షణ
బొప్పాయి ఆకులలోని విటమిన్లు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చర్మ కణాల నష్టాన్ని నివారిస్తాయి మరియు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. దీని ద్వారా ముఖంపై మచ్చలు మరియు గీతలు రాకుండా ఉంటాయి.
రక్తంలో చక్కెర నియంత్రణ
బొప్పాయి ఆకుల రసం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది మరియు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అంతేకాదు, ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. బొప్పాయి ఆకులో విటమిన్ ఏ మరియు సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బొప్పాయి ఆకుల రసం తయారుచేసే విధానం
- బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు వీటిని మూడు కప్పుల నీటిలో వేసి మరిగించుకోవాలి.
- చల్లారిన తర్వాత వడకట్టుకొని ఉదయం పరగడుపున తీసుకోవాలి. అవసరమైతే, కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.