Rose Colours and their Meaning: ఏ రంగు గులాబీ కి ఏమి అర్ధమో తెలుసా?


rose

వాలంటైన్స్ డే…ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ఈ రోజుని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారు.అయితే ఫిబ్రవరి 14 కి కరెక్ట్ గా ఒక్క వారం ముందు వాలంటైన్ వీక్ మొదలవుతుంది.ఫిబ్రవరి 7 న మొదలయ్యే ఈ వాలంటైన్ వీక్ 7 రోజులు ఒక్కో రోజుకి ఒక్కో స్పెషాలిటీ ఉంది.ఇందులో మొదటిది రోజ్ డే.

తమకు ఇష్టమైన వారికి ఒక గులాబీ పువ్వు ఇచ్చి తమ ప్రేమను వ్యక్త పరచడమే ఈ రోజ్ డే యొక్క ముఖ్య ఉద్దేశం.మరి గులాబీ పూలు చాలా రంగుల్లో ఉంటాయి కదా…ఏ రంగు పువ్వు ఇవ్వాలి.అసలు ఒక్కో రంగు గులాబీ పువ్వు కి ఒక్కో అర్థం ఉందని తెలుసా.అసలు ఈ రంగురంగు గులాబీల కథ ఏంటో తెలుసుకుందాం రండి.

ఎరుపు రంగు

ఈ ఎరుపు రంగు ప్రేమకు చిహ్నం.వారి మీద ఉన్న ఇష్టాన్ని ఇది సూచిస్తుంది.ఈ గులాబీని తమకి నచ్చిన వ్యక్తులకి ప్రపోజ్ చేయడానికి వాడుతూ ఉంటారు.రోజ్ డే రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ఎర్ర గులాబీల అమ్మకాలు ఒక రేంజ్ లో ఉంటాయి.మీ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడానికి ఎరుపు రంగు గులాబీ కంటే గొప్ప ఛాయిస్ ఇంకోటి ఉండదు.

పింక్ గులాబీలు

వీటిని మన దగ్గర రాణి రంగు గులాబీ అని కూడా అంటూ ఉంటారు.వీటిని ఎవరినైనా అభినందించటానికి లేదా వారికి థాంక్స్ చెప్పటానికి ఎక్కువ ఇస్తూ ఉంటారు.మీకు బాగా ఇష్టమైన వారి పట్ల మీకున్న గ్రాటిట్యూడ్,వారిపై మీకున్న ఆప్యాయతని తెలియపరచటానికి ఇవి పర్ఫెక్ట్ అని చెప్పాలి.

పసుపు గులాబీ

ఈ రంగు గులాబీలను ఎక్కువగా స్నేహితులు ఒకరికొకరు ఇచ్చుకుంటారు.ఈ పసుపు రంగు స్నేహితుల మధ్య ఉన్న స్నేహాన్ని ,ఆనందాన్ని సూచిస్తుంది.ఈ పూలను ఎక్కువగా ఫ్రెండ్ షిప్ డే రోజు ఒకరికొకరు ఇచ్చుకుంటారు.ఇది స్నేహాన్ని,వారి మధ్య ఉన్న అనురాగానికి ప్రతీకగా ఉంటుంది

తెలుపు గులాబీలు

రంగుకు తగ్గట్టే ఇవి స్వచ్ఛత కి మారుపేరు.ఒక కొత్త బంధాన్ని,జీవితం లో ఒక కొత్త ప్రారంభాలకు గుర్తుగా ఇస్తూ ఉంటారు.ఇతరుల మీద ఉన్న గౌరవానికి గుర్తుగా కూడా తెలుపు గులాబీలని ఇస్తారు.వీటిని ఎక్కువగా కొత్తగా పెళ్లి అయిన జంటలకు వారి నూతన బంధాన్ని సూచిస్తూ ఇస్తూ ఉంటారు.

ఆరంజ్ గులాబీలు

ఈ పూలని బలానికి,ఉత్సాహానికి ప్రతీకగా ఇస్తారు.మీరు ప్రేమించే వారి పట్ల మీకున్న అభిరుచిని,వారి పట్ల మీకున్న గాఢ ప్రేమను తెలియజేయటానికి ఈ పూలు బెస్ట్ ఛాయస్.

లావెండర్ గులాబీలు

తాము ఎక్కువ ఆరాధించే వ్యక్తులకు ఈ రంగు గులాబీని ఇస్తూ ఉంటారు.ఈ లావెండర్ రంగు సున్నితత్వాన్ని,దయ,జాలి ని తెలియజేస్తాయి.మీరు ఎవరితో అయినా తొలి చూపులోనే ప్రేమలో పడితే వారికి పక్కా ఈ రంగు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయండి.

పీచ్ గులాబీలు

వీటిని మంచి జరగాలి అన్న గొప్ప ఉద్దేశం తో ఇస్తూ ఉంటారు.ఈ పీచ్ రంగు ఇతరుల పట్ల మీకున్న సానుభూతి,వినయాన్ని తెలియజేస్తుంది.ఈ రంగు బలమైన ఎమోషన్ ని కూడా సూచిస్తుంది.ఇతరుల పై మీకున్న చిత్తశుద్ధి ని ఈ రంగు గులాబీలు తెలియజేస్తాయి.కాబట్టి మీ పార్టనర్ కి ఈ పీచ్ రంగు గులాబీ కూడా ఇవ్వొచ్చు.

Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros