Update #1 – *CFMS Bills Update*
ఇప్పుడు CFMS బిల్ స్టేటస్ కేవలం సంబంధిత DDO లాగిన్ లో మాత్రమే చెక్ చేసుకునేలా ఆప్షన్ ఇవ్వడం జరిగినది.
గతంలో CFMS వెబ్సైట్ నందు ఏ DDO లాగిన్ లో అయినా బిల్ నెంబర్ తో బిల్ స్టేటస్ తెలుసుకునే ఆప్షన్ ఉండేది.ఇప్పుడు దానిని Disable చేశారు.
ఒకవేళ వేరొక DDO లాగిన్ లో బిల్ నెంబర్ ఎంటర్ చేసి search చేస్తుంటే *you are authorised’ the bill is not under your jurisdiction* అని చూపిస్తున్నది.
మార్పును గమనించగలరు.
Update #1 – *🧑🏻💻𝐓𝐨𝐝𝐚𝐲’𝐬 𝐀𝐏 𝐒𝐜𝐡𝐨𝐨𝐥 𝐀𝐬𝐬𝐞𝐦𝐛𝐥𝐲 𝐍𝐞𝐰𝐬*
┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅
*_❍ప్రపంచ పొదుపు దినోత్సవము_*
*_❍స్వామి దయానంద సరస్వతి వర్ధంతి_*
┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅
*🧑🏻💻అంతర్జాతీయ వార్తలు…* ━━━━━━━━━━━━━━━━━━━━━
*_➤గాజాలో సాయం అందిస్తున్న ఐక్యరాజ్యసమితి బృందాలు ఇజ్రాయిల్ భూభాగాన్ని వాడుకోకుండా నిషేధిస్తూ ఇజ్రాయిల్ నిన్న చట్టం చేసింది._*
*_➤లెబనాన్ లోని హెజ్ బొల్లా మిలిటెంట్ గ్రూప్ నూతన చీఫ్ గా షేక్ నయీం కాసిం ఎన్నికయ్యారు._*
*_➤ఉగ్రదాడికి కుట్ర, దేశ రహస్యాల బహిర్గతం వంటి ఆరోపణలతో ఇరాన్- జర్మనీ జాతీయుడిని ఇరాన్ ఉరి తీసినందుకు నిరసనగా ఇరాన్ లోని తమ దేశ రాయబారిని జర్మనీ నిన్న వెనక్కి పిలిపించింది._*
*_➤సమాజంలో స్ఫూర్తిని వివిధ వర్గాల మధ్య శాంతి సామరస్యాలను పెంపొందించేందుకు చేసిన కృషికి గాను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కు ఫిజీ దేశం “ఆనరరీ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి”పురస్కారాన్ని అందజేసింది._*
*_➤దక్షిణ చైనా సముద్రం పై చైనా ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా ఇండో -పసిఫిక్ ప్రాంత భద్రతకై భారత్-స్పెయిన్ దేశాలు కలిసి పనిచేయాలని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ పిలుపునిచ్చారు._*
*_➤ఉత్తరకొరియా రష్యాకు 12,000 మంది సైనికులను తరలిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ తెలియజేశారు._*
*👩🏻💻జాతీయ వార్తలు…*
━━━━━━━━━━━━━━━━━━━━━
*_➨చెన్నైలో రూ.27 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత_*
*_➨నిన్న ఒక్క రోజే 100 విమానాలకు బాంబు బెదిరింపులు_*
*_➨ఉగ్రవాదుల చొరబాట్ల విషయంలో అప్రమత్తం ఉన్నాం-ఆర్మీ_*
*_➨దేశంలో 70 ఏళ్ళు దాటిన వృద్ధులకు రూ.5లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందించే ‘ఆయుష్మాన్ భారత్ వయ వందన’ కార్డులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న పంపిణీ చేశారు._*
*_➨దేశవ్యాప్తంగా 40 ప్రదేశాలలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో 51,000 మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న వర్చువల్ విధానంలో నియామక పత్రాలను అందజేశారు._*
*_➨కేరళలోని నీలేశ్వరం సమీపంలోని ఓ ఆలయంలో తెయ్యం ప్రదర్శన జరుగుతున్న సమయంలో బాణాసంచా పేలుడు ఘటనలో 154 మంది గాయపడ్డారు._*
*_➨ఎలాంటి అవాంతరాలు లేకుండా కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా జనన మరణాలను నమోదు చేయడానికి వీలు కల్పించే సరికొత్త మొబైల్ అప్లికేషన్ ‘పౌర నమోదు వ్యవస్థ (సి ఆర్ ఎస్) నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు._*
*_➨రాజస్థాన్ లోని శ్రీకర్ జిల్లాలో లక్ష్మణ్ ఘడ్ లో ఫ్లైఓవర్ గోడను బస్సు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందగా 36 మంది తీవ్రంగా గాయపడ్డారు._*
*_➨సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిన్న ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో హోం మంత్రి అమిత్ షా ‘ఐక్యతా పరుగు’ను ప్రారంభించారు._*
*🧑🏻💻రాష్ట్ర వార్తలు…*
━━━━━━━━━━━━━━━━━━━━━
*_➯నవంబర్ 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు._*
*_➯ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో కాకినాడ జిల్లా లో ఏర్పాటుచేసిన లిపియస్ ఫార్మా పరిశ్రమకు ప్రారంభోత్సవం, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనను నిర్వహించారు._*
*_➯రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉండే మినహాయింపులను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం నిన్న మార్గదర్శకాలు విడుదల చేసింది._*
*_➯సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది._*
*_➯ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) తుది కీని విడుదల చేసి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలియజేశారు._*
*_➯రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ- 2025 కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది._*
*_➯రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ఐదు జిల్లాల పరిధిలో 54 కరువు మండలాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది._*
*_➯ప్రసిద్ధ వ్యవసాయ ఉద్యానవన విశ్రాంతశాస్త్రవేత్త డాక్టర్ మొవ్వ రామారావు అనారోగ్యంతో తెనాలిలో నిన్న మరణించారు._*
*_➯రాష్ట్రవ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నిన్న బదిలీ చేసింది._*
*_➯భారతీయ విజ్ఞాన మండలి, సైన్స్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కౌశల్-2024 రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలు నవంబర్ 20 నుంచి నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలియజేశారు._*
*🏏🏑క్రీడా వార్తలు…*
━━━━━━━━━━━━━━━━━━━━━
*_✦రాష్ట్రంలో అమరావతి, అనంతపురం, విశాఖపట్నంలో ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ క్లబ్బుల ఏర్పాటుకు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ముందుకు వచ్చారు._*
*_✦న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత మహిళల జట్టు 2-1 తో కైవసం చేసుకుంది._*
*_✦ప్రతిష్టాత్మక ఏటీపీ ఫైనల్స్ లో భారత స్టార్ ఆటగాడు రోహన్ గోపన్న- ఎబ్డెన్ జోడీ స్థానం సంపాదించింది._*
*⛈️వాతావరణ వార్తలు….*
━━━━━━━━━━━━━━━━━━━━━
*_🌧️రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది._*
*_🙏🏻నేటి వార్తలు ఇంతటితో సమాప్తం..ధన్యవాదములు…🙏🏻_*
*_🗣️నేటి మంచి మాట…_*
━━━━━━━━━━━━━━━━━━━━━
*_✍🏻మనకు ఒకటి నచ్చలేదు అంటే సమస్య మనది తప్ప అవతలది కాదు,కనుక ముందు మనల్ని మనం మార్చుకోవాలి._*
*🩺🫀ఆరోగ్య చిట్కాలు*
━━━━━━━━━━━━━━━━━━━━━
*_🌿మునగ ఆకు మునగ కాయలు ఆహారంలో తీసుకోవడం వలన కంటిచూపు మెరుగవుతుంది_*
*_✍🏻నేటి GK ప్రశ్న.._*
━━━━━━━━━━━━━━━━━━━━━
*_𝐐:-ప్రపంచంలో బౌద్ధుల జనాభా అధికంగా కలిగిన దేశం ఏది❓_*
*✍🏻నిన్నటి GK ప్రశ్నకు సమాధానం..*
━━━━━━━━━━━━━━━━━━━━━
*_𝐐:-జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చినది ఎవరు❓_*
*_𝐀𝐧𝐬:- లాల్ బహదూర్ శాస్త్రి_*
Update #1 – *📚✍️ప్రత్యేక అవసరాల పిల్లలకు 10 మార్కులు వస్తే పాస్✍️📚*
*🌻ఈనాడు, అమరావతి:* పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాసే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉండే మినహాయింపులను ప్రస్తావిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం మార్గదర్శకాలు విడుదల చేసింది. మెంటల్ రిటార్డేషన్ స్థానంలో మేథో వైకల్యంగా పేరు మార్చింది. అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణత మార్కులు 35కు బదులుగా 10 మార్కులు వస్తే చాలని పేర్కొంది.
Update #1 – మన బడి మన భవిష్యత్తు ( నాడు నేడు ) యాప్
Update #1 – TaRL
Update #1 – Udise Name as per record name change details
💈Udise నందు Current academic year new join వాళ్ళవి edit అవ్వదు అని note ఇచ్చారు కానీ. New join కూడ name edit అవుతుంది.
#U_DISE