Today Live Updates of 02-11-2024


Update #1 – *జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పొడిగింపు*

Posted on: November 2, 2024 10:01 am
*జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పొడిగింపు*

 

జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తుల గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. మొదట ప్రక టించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 30తో గడువు ముగియగా.. మరో 15 రోజులు పొడిగించింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీ టీఈ), విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ద్వారా ఈ పథకాలను అమలు చేస్తోంది. ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్నకు టెక్ని కల్ డిగ్రీ, డిప్లొమా మొదటి ఏడాది బాలికలుఅర్హులు. వీరికి ఏడాదికి రూ.50 వేల చొప్పున ఉప కార వేతనం లభిస్తుంది. ఏఐసీటీఈ సాక్షమ్ టెక్ని కల్ డిగ్రీ, డిప్లొమాలో ఏ సంవత్సరంలోనైనా దివ్యాంగులకు ఏడాదికి రూ.50 వేలు అందుతుంది. ఏఐసీటీఈ స్వాంతన్ కింద తల్లిదండ్రులు చనిపో యిన అనాథలకు ఏ సంవత్సరంలోనైనా రూ.50 వేలు లభిస్తుంది. యూజీసీ పోస్టుగ్రాడ్యుయేట్స్కు మొదటి ఏడాది చదువుతున్నవారు అర్హులు. వీరు ఉపకార వేతనానికి ఎంపికైతే నెలకు రూ.10 వేల చొప్పున 15 నెలలు చెల్లిస్తుంది.


Update #1 – *Revised Time table Self assesment model paper -2 పరీక్షలు*

Posted on: November 2, 2024 7:50 am
 

*4-11-24 నుండి 8-11-24 వరకు జరుగును.*

 

*1 నుండి 5 తరగతులు*

 

6-11-24 ( బుధవారం ) తెలుగు,లెక్కలు

 

7-11-24 ( గురువారం ) – ఈవీఎస్, ఇంగ్లీషు

 

*✨6 నుండి 10 తరగతులు*

 

4-11-24 ( సోమవారం )-OSSC 1&2

 

6-11-24 ( బుధవారం ) తెలుగు,లెక్కలు

 

7-11-24 ( గురువారం ) – హిందీ, సైన్స్

 

8-11-24 ( శుక్రవారం ) – ఇంగ్లీష్, సోషల్


Update #1 – School Assembly news

Posted on: November 2, 2024 7:42 am
💠 *అంతర్జాతీయ వార్తలు::*

 

📌 వరదల కారణంగా స్పెయిన్ మరియు నైజీరియాలో మరణించిన వారి సంఖ్య వరుసగా 202 మరియు 321గా ఉంది.

 

📌ఈజిప్ట్‌లోని లక్సోర్‌లో జరిపిన త్రవ్వకాలలో 4,000 సంవత్సరాల క్రితం మానవుల ఖనన ఆచారాలు గురించి విషయాలు వెల్లడయ్యాయి.

 

💠 *జాతీయ వార్తలు:*

 

📌మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌లను అందించేందుకు ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించింది.

 

📌 కొత్త రైలు టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

 

📌భారతదేశం సెక్యులర్ సివిల్ కోడ్ అయిన వన్ నేషన్ సివిల్ కోడ్ వైపు పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

 

💠 *రాష్ట్ర వార్తలు:*

 

📌ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు సిలిండర్లను అందజేసారు.

 

📌 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో సంక్రాంతి నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

 

💠 *క్రీడా వార్తలు:*

 

📌ఆఖరి టెస్టు ప్రారంభ రోజున న్యూజిలాండ్‌పై భారత్ 149 పరుగుల తేడాతో వెనుకంజలో ఉంది.


Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros