Update #1 – పాఠశాలల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
❈──────🎀─────❈
*_🌎అమరావతి, ఆంధ్రప్రభ:-2025-26 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న పాఠశాలలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్తో పాటు అప్గ్రేడేషన్ కోసం డిసెంబర్ 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పాఠశాల ఏర్పాటు చేసే ప్రాంతంలో విద్యార్థులు, జనాభా సంఖ్య, అప్పటికే ఏర్పాటు చేసిన పాఠశాలల్లో చదువు తున్న విద్యార్థుల సంఖ్యను బట్టి, అవసరాన్ని బట్టి అనుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే యేడాది జనవరి 26వ తేదీన కొత్త పాఠశాలలకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైనా తరగతి అప్గ్రేడ్ చేయడానికి కూడా డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమతి ప్రక్రియలో భాగంగా ఉప విద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల నిబంధనలు, తదితర వివరాలు పరిశీలించి జస్టిఫికేషన్ రిపోర్టు సమర్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న 7 రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు ఆర్జేడీ, డీఈవోలు తగు చర్యలు తీసుకోవాలని విజయరామరాజు ఆదేశించారు.
Update #1 – తగ్గించిన అదనపు పింఛన్ను పునరుద్ధరించాలి
*♦️సీఎం చంద్రబాబుకు ఏపీ పింఛనర్ల సంఘం విజ్ఞప్తి*
*🌻ఈనాడు, అమరావతి:* పింఛనుదారులకు గతంలో తగ్గించిన 3 శాతం అదనపు పింఛన్ ను పునరుద్దరించాలని ఏపీ పింఛనర్ల సంఘం (అమరావతి) సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. సంఘం నేతలు బుధవారం సచివాల యంలో సీఎంను కలిశారు. సంఘం అధ్యక్షుడు పూర్ణచంద్రరావు విలేకరులతో మాట్లాడారు. కమ్యూటేషన్ పునరుద్ధరణ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని, ఈ హెచ్ఎస్ కార్డుపై పూర్తిగా నగదు రహిత వైద్యం అందేలా చూడాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదార్లపై ఉద్యమ కాలంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరినట్లు తెలిపారు. ఏపీ పింఛను దార్ల కార్పొరేషన్ ఏర్పాటు వాగ్దానాన్ని సీఎంకు గుర్తుచేశామని పేర్కొన్నారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలో సమావేశం నిర్వహించి. అన్ని అంశాలపై చర్చిద్దామని పేర్కొన్నట్లు చెప్పారు. సీఎంను కలిసిన వారిలో కన్వీనర్ గురవయ్య, కోఆర్డినేటర్ విజ్జమ్ చౌదరి తదితరులు ఉన్నారు.