Update #4 – *Today’s Important Activities*
1. To Complete Pending 50000 students APAAR validation
2.To complete Pending 30954 Students APAAR generation
3.To complete Pending 14000 students FA 1 Marks Entry
4.To pay SSC Students Exam Fee
5.Perfect Conduct of FA 2 Exams
6.Marking of 100℅ attendance of Teachers in online intime
7.Marking 100℅ Students attendance in time
8.Proper implementation of MDM
9.Conduct of remedial classes to Slow Learners
10.Conduct of extra classes to SSC Students
11.To teach about Good Touch and Bad touch and moral values to the students
All the Stake holders of Education Department are requested to complete the above tasks.
Update #3 – Late birth certificate
1. మొదట “Non-Availability of Birth Certificate” కోసం సచివాలయం లేదా మీ-సేవ కేంద్రంలో అప్లై చేసుకోవాలి. ఈ సర్టిఫికెట్ మునిసిపల్ కమిషనర్ గారు ఆమోదిస్తారు. సర్టిఫికెట్ వచ్చిన తర్వాత,
2. “లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్” కోసం సచివాలయం/మీ-సేవ కేంద్రంలో అప్లై చేయాలి. ఈ దరఖాస్తు MRO గారి ద్వారా RDO కార్యాలయానికి పంపబడుతుంది, అక్కడ RDO ఆఫీసులో ఆమోదం పొందుతుంది. ఈ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత,
3. మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లై చేయాలి. అప్పుడు బర్త్ సర్టిఫికెట్ జారీ అవుతుంది.
Update #2
*✳️రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు 11న అవార్డుల ప్రదానం*
*✳️పాఠశాల, ఇంటర్ విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేశ్*
మెగా డీఎస్సీని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయా లని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదే శించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై మంగళ వారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘డీఎస్సీలో సాధ్యమైనంత ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యం. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ నెల 11న అవార్డులు ప్రదానం చేయనున్నాం. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చే చర్యల్లో భాగంగా తల్లిదండ్రులను భాగస్వాము లను చేయాలి. డిసెంబరు మొదటి వారంలో తల్లిదం డ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి. రాష్ట్రం మొత్తాన్ని నాలుగు జోన్లుగా విభజించి విద్యార్థు లకు అందించే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయాలి. మండలానికో జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రశ్నా పత్రాలను ఏఐ ద్వారా మూల్యాంకనం చేసే అంశాన్ని పరిశీలించాలి. ప్రభుత్వ కళాశా లల్లో చదివి జేఈఈ, నీట్ లాంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫొటోలు దినపత్రికల్లో ప్రచురించాలి. గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్ కళాశాలల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలి” అని లోకేశ్ ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ప్రవేశపెట్టడంతో పాటు ప్రశ్నప త్రంలో మార్పులు చేయనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
*♦️మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా*
మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా.. పలు అనివార్య కారణాలతో అధికారులు వాయిదా వేశారు. మరో నాలుగైదు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Update #1 – School Assembly news
📌 గాజా సరిహద్దులో 94,000 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
📌హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో 65 మిలియన్ల మందికి పైగా ఆహార భద్రత లేదు: UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) నివేదిక.
💠 *జాతీయ వార్తలు:*
📌భారతదేశ ఇస్రో డిసెంబర్‌లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మిషన్ PROBA-3ని ప్రయోగించనుంది.
📌అన్ని ప్రైవేట్ ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదని చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.
📌 సుప్రీం కోర్టు UP బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004 యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సమర్ధించింది.
💠 *రాష్ట్ర వార్తలు:*
📌ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూ కబ్జాలపై విమర్శలు గుప్పించారు, సంఘ వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు పిలుపునిచ్చారు.
📌 నేడు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును సందర్శించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చించనున్న నిపుణుల కమిటీ.
💠 *క్రీడా వార్తలు:*
📌భారతదేశం అధికారికంగా 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పంపింది.
📌చెస్ గ్రాండ్ మాస్టర్స్ 2024 ప్రారంభ రౌండ్‌లో భారత అగ్ర ర్యాంక్ ఆటగాడు అర్జున్ ఎరిగైసి, విదిత్ గుజరాతీతో తలపడనున్నాడు.