Today Live Updates of 09-11-2024


Update #4 – School Grants release చేసుకునే పద్దతి

స్కూల్ గ్రాంట్ కోసం PMSHRI APP లో ప్రతీ పాఠశాల వారు ఈ ఎస్టిమేషన్లో మనకు రిలీజ్ అయినటువంటి గ్రాంట్ మొత్తం కు సరిపోయేట్టుగా కాంపౌనేంట్లో ఎంత ఖర్చు పెడుతున్నారో అమౌంట్ రాసి అడుగున పాఠశాల స్టాంపు హెచ్ఎం సంతకం వేసి ఫోటో తీసి కాంపోనెంట్ వైస్ గా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చిన తీర్మానం డౌన్లోడ్ చేసి మన ఎస్ఎంసి చైర్మన్ కొందరు కమిటీ సభ్యులు హెచ్ఎం గారు సంతకం చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది.
ఇది చేసిన తరువాత MEO LOGIN లో approve చేస్తే అప్పుడు SSA జిల్లా వారు మన PFMS పాఠశాల account లో ఆ గ్రాంట్ జమ చేస్తారు. తదుపరి PFMS లో మనం పాత పద్ధతిలో బిల్ చేసుకొని PPA బ్యాంక్ కు ఇస్తే అది HM గారి అకౌంటు లో జమ అవుతుంది

#PFMS


Update #3 – APAAR విషయంలో ఆధార్ సెంటర్ వారు చెప్పిన విషయాలు:

1) 18 సం .లోపు వయస్సు ఉన్న వారికి ఆధార్ లో ఫోన్ నెంబర్, వేలిముద్రలు తప్ప ఎటువంటి కరెక్షన్ చెయ్యాలన్నా ” బర్త్ సర్టిఫికేట్” తప్పనిసరి.

2) ఆ బర్త్ సర్టిఫికెట్ QR CODE తో ఉండాలి మరియు లామినేషన్ చేసి ఉండరాదు.

LAMINATION చేసి ఉన్నప్పటికీ కొంత మందికి అయ్యే అవకాశం ఉన్నది

3) పాత బర్త్ సర్టిఫికెట్ లు పనిచేయడం లేదు.

4) పాత బర్త్ సర్టిఫికెట్ ను చూపించి పంచాయితీ వద్ద కొత్తది పొందవచ్చు.

5) మున్సిపాలిటీ బర్త్ సర్టిఫికేట్ అయితే “మీ సేవ” కేంద్రం నుండి కొత్తది పొందవచ్చు.

6) SSC CERTIFICATE తో స్టూడెంట్ పేరు కరెక్షన్ అవుతోంది.

7) తల్లి ,తండ్రి పేర్లలో కరెక్షన్ కొరకు పంచాయతీ సెక్రటరీ సర్టిఫికెట్ లేదా gazetted Officer సంతకం.

8) స్టూడెంట్ , తల్లి లేదా తండ్రి ఉండాలి.

*ఆధార్ లో ఇంటిపేరు,పూర్తి పేరు,పుట్టిన తేదీ,తల్లిదండ్రులు పేర్లు అక్షర దోషాలు,యాడింగ్ చెయ్యాలంటే బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి.*

బర్త్ సర్టిఫికెట్ ఈ విధముగా ఉంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి అర్హులు :-

📍 ప్రస్తుత బర్త్ సర్టిఫికెట్ అయ్యి ఉండాలి.
ఇంగ్లీషు భాష అయ్యి ఉండాలి.
QR కోడ్ కల్గి ఉండాలి.

📍 బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్,ఫొన్ లో ఫోటో పని చెయ్యదు.
ఒరిజినల్ సర్టిఫికెట్ అయ్యి ఉండాలి.

📍బర్త్ సర్టిఫికెట్ లామినేషన్ చేసి ఉండరాదు.


Update #2 – School Assembly news

💠 *అంతర్జాతీయ వార్తలు::*

📌 అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మొదటి మహిళా వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ వైల్స్‌ను నియమించారు.

📌ఇండోనేషియాలోని లెవోటోబి పర్వతం మళ్లీ విస్ఫోటనం చెంది, 5,000 మీటర్ల ఎత్తు వరకు బూడిద వెదజల్లింది మరియు దీని ప్రభావంతో విమానయాన హెచ్చరికలను జారీ చేశారు.

💠 *జాతీయ వార్తలు:*

📌సుప్రీం కోర్ట్, 4-3 తీర్పులో, అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (AMU)కి మైనారిటీ హోదాను నిరాకరించిన 1967 నాటి తీర్పును తోసిపుచ్చింది.

📌భారత్ మరియు రష్యా దశాబ్దాలుగా సహజ మిత్రులు మరియు భాగస్వాములు: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

📌వార్షిక ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ (IMHF) రెండవ ఎడిషన్ జాతీయ రాజధానిలో ప్రారంభమైంది.

💠 *రాష్ట్ర వార్తలు:*

📌ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు డా.యల్లాప్రగడ సుబ్బారావు వైద్య కళాశాలగా నామకరణం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

📌 విజయవాడ-శ్రీశైలం సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు.

📌 AP స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (AP SCERT) డైరెక్టర్‌గా M V కృష్ణా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

💠 *క్రీడా వార్తలు:*

📌జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ డిసెంబర్ 6న బెంగళూరులో ప్రారంభం కానుంది.

📌 భారత చెస్ సంచలనం అర్జున్ ఇరిగేశి ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు.

📌సౌత్ ఆఫ్రికా తో జరిగిన మొదటి T20 మ్యాచ్ ను 61 పరుగుల తేడాతో గెలిచి ఇండియా 4 మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తో ముందంజలో ఉంది.


Update #1 – School Assembly news

💠 *International News::*

📌 US President-elect Trump Appoints Susie Wiles as First Female White House Chief of Staff.

📌Mount Lewotobi in Indonesia erupted again, spewing a column of ash up to 5,000 meters high and prompting the highest aviation alert.

💠 *National news:*

📌Supreme Court, in 4-3 verdict, overturns 1967 ruling denying minority status to Aligarh Muslim University (AMU).

📌India and Russia are natural allies and partners for decades: Russian President Vladimir Putin.

📌The second edition of the annual Indian Military Heritage Festival (IMHF) began in the National Capital.

💠 *State News:*

📌AP Government issued orders to name Eluru Government Medical College as Dr.Yallapragada Subba Rao Medical College.

📌 Vijayawada-Srisailam Sea Plane trial run conducted succesfully.

📌 M V Krishna Reddy assumed charge as Director, AP State Council of Educational Research and Training (AP SCERT).

💠 *Sports News:*

📌National Wrestling Championship to kick off on Dec 6 in Bengaluru.

📌 India’s Chess sensation Arjun Erigaisi leapfrogged to second place in the world chess rankings.

📌India won 1st T20 match against South Africa with 61 runs and thus lead 4 match T20 Series 1-0.


Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros