Today Live Updates of 12-11-2024


Update #6

*స్కూల్ కాంప్లెక్స్ ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా…*

 

*స్కూల్ కాంప్లెక్స్ వారిగా సి ఆర్ ఎం టి (క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్) ల వివరాలు సేకరణ*

 

*ప్రత్యేక ఫార్మేట్ లో వెంటనే పంపాలంటూ జిల్లా విద్యాశాఖలకు ఆదేశాలు


Update #5

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*సమగ్ర శిక్షా*

పత్రికా ప్రకటన (12.11.2024)

 

*మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వాయిదా*

• సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు IAS.,

 

 

పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఈ నెల 14న అన్ని పాఠశాలల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబరు మొదటి వారంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో తేదీ, ఇతర వివరాలను ప్రకటిస్తామని వెల్లడించారు.

 

*రాష్ట్ర పథక సంచాలకులు* (వారి తరఫున)

సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్.


Update #4 – *PFMS SCHOOL GRANTS పై అవగాహన కోసం*

*PFMS SCHOOL GRANTS పై అవగాహన కోసం*

ముందుగా PM SHRI APP INSTALL

USERNAME: OLD IMMS USERNAME & PASSWORD:Pmshri@2024

non-PMSHRI SCHOOLS వారు 3rd column “composite grants for schools” పై click

next “estimation” పై click

next page down “create new estimation” పై click

ఈ page లో current bills,stationary,events,repairs ఇలా మీరు ఖర్చు చూపెట్టే వాటివి రాసి proceed అవ్వాలి అలాగే దీనిలో photos to upload చేయాలి

తరువాత estimation copy ను download చేసికొని pc chairman pc సభ్యులందరి సంతకాలు తీసుకోవాలి

composite grants for schools లో 2nd column “upload pc resolution signed copy పై click చేసి pc సభ్యులందరి సంతకాల copy upload చేయాలి

తరువాత meo/deo గారు approve చేయాలి ఆ తరువాత మాత్రమే మన PFMS ACCOUNT లో డబ్బులు పడతాయి

డబ్బులు పడిన తరువాత composite grants for schools లో 3rd column “bill capture” లో bills upload చేయాలి..


Update #3 – APAAR ID INSTRUCTIONS

*అపార్ ఐడి పూర్తి చేయుటకు మరికొన్ని ముఖ్య సూచనలు*

1. తల్లిదండ్రుల consent form కచ్చితంగా పాఠశాలలో ఉండవలెను.
2. కాన్సెంట్ ఫామ్ లేకుండా ఏ ఒక్క ఆధార్ నెంబర్ను ఎవరూ కూడా ఉపయోగించడానికి లేదు. ఇది ఆధార్ నియమ నిబంధనలకు విరుద్ధము. చట్టపరమైన చర్యల తీసుకునే అవకాశం కలదు. కావున ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రుల అంగీ కార పత్రాన్ని పాఠశాల వారు సేకరించవలెను.
3. గౌరవ కమిషనర్ గారు అపర్ ఐడి పూర్తి చేయుటకు మార్పులు చేర్పుల కొరకు ఇచ్చిన సర్కులర్ ప్రకారం పాఠశాల రికార్డు నందు మార్పుల కొరకు ఒక క్రమ పద్ధతిని పాటించవలెను.
4. మార్పు చేయదలచిన పేరు కొరకు తల్లిదండ్రుల అఫిడవిట్ నోటరీ చేయబడి తీసుకోవలెను. మరియు తల్లిదండ్రుల నుండి పేరు మార్పు కొరకు దరఖాస్తులు తీసుకోవలెను.
5. డేట్ అఫ్ బర్త్ మార్పు కొరకు బర్త్డే రిజిస్టర్ సర్టిఫికెట్ తల్లిదండ్రుల నోటరీ చేయబడిన అఫిడవిట్, తల్లిదండ్రులు DOB మార్పు కొరకు కోరే దరఖాస్తు ఉండవలెను
6. మార్పు చేయుచున్న పేరు, డేట్ అఫ్ బర్త్ అడ్మిషన్ రిజిస్టర్ నందు కొట్టివేయకుండా, కేవలం రౌండ్ చేసి, వాటి పక్కన కొత్తగా మార్పు చేయుచున్న వాటిని నమోదు చేయవలెను. కొట్టివేతలు, వైట్ ఫ్లూయిడ్ వాడవద్దు.
7. పాఠశాల రికార్డు నందు మార్పులు చేర్పులు చేయుటకు మార్చి 31,2025 వరకు మాత్రమే అవకాశం కలదు.
8. కావున ఈ సదవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవలెను.
9. ప్రధానోపాధ్యాయులు మార్పు చేసిన విద్యార్థుల పేరు, పాత మార్పు కొత్త మార్పు ఒక పట్టిక రూపంలో తెలియజేస్తూ అడ్మిషన్ రిజిస్టర్ నందు ఉంచవలెను. విద్యార్థులు మార్పు కొరకు ఇచ్చిన పత్రాలను వారి అడ్మిషన్ ఫారంతో జత పరచవలెను.
10. భవిష్యత్తు నందు ఈ మార్పులపై ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా తగు జాగ్రత్తలు/ చర్యలు తీసుకుని మాత్రమే మార్పులు చేయవలెను.

#APAAR


Update #2 – School Assembly news

💠 *అంతర్జాతీయ వార్తలు::*

📌 గత 50 ఏళ్లలో 73% వన్యప్రాణులు క్షీణించాయి: వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) యొక్క లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2024

📌UN వాతావరణ మార్పుల సమావేశం, COP29 అజర్‌బైజాన్‌లోని బాకులో ప్రారంభమయ్యింది.

📌జపాన్‌లో, లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన షిగెరు ఇషిబా ఆ దేశ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు.

💠 *జాతీయ వార్తలు:*

📌భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

📌 భారత యువత సామర్థ్యానికి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

📌కాలుష్య రహిత వాతావరణంలో జీవించడం వ్యక్తి ప్రాథమిక హక్కు, వాయు కాలుష్యాన్ని ఏ మతం ప్రోత్సహించదు: సుప్రీం కోర్టు

💠 *రాష్ట్ర వార్తలు:*

📌ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024-25కి రూ. 2.94 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్పించింది.

📌ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి.

💠 *క్రీడా వార్తలు:*

📌 బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఆసియా మహిళల హాకీ ఛాంపియన్ షిప్‌ పోటీలను బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రారంభించారు.

📌2034 ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను సౌదీ అరేబియా కు కేటాయించవద్దని FIFA ను కోరిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక.


Update #1 – School Assembly news

💠 *International News::*

📌 73% wildlife declined in last 50 years: World Wide Fund for Nature (WWF)’s Living Planet Report 2024

📌UN Climate Change Conference, COP29 began at Baku in Azerbaijan.

📌In Japan, Liberal Democratic Party’s Shigeru Ishiba re-elected as country’s Prime Minister.

💠 *National news:*

📌Justice Sanjiv Khanna takes oath as 51st Chief Justice of India at Rashtrapati Bhavan.

📌 PM Narendra Modi says, whole world is spellbound by Indian youth’s capability.

📌To Live In Pollution Free Atmosphere Is Fundamental Right, No Religion Encourages Air Pollution: Supreme Court.

💠 *State News:*

📌Andhra Pradesh Government presents Rs 2.94 lakh crore Budget for 2024-25.

📌AP Assembly Sessions Postponed to Wednesday.

💠 *Sports News:*

📌 Bihar CM Nitish Kumar inaugurated Asian Women’s Hockey Championship in Rajgir, Bihar.

📌FIFA urged to avoid awarding 2034 World Cup hosting rights to Saudi Arabia in new Amnesty International report.


Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros