Update #3 – School Assembly news
📌డొనాల్డ్ ట్రంప్, తన ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్‌ను నామినేట్ చేశారు.
📌2050 నాటికి భూమిపై ప్లాస్టిక్ వ్యర్థాలు రెట్టింపు అవుతాయి: అధ్యయనం
📌 ప్రపంచంలో అత్యధిక గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేసే నగరాల్లో చైనాలోని షాంఘై మొదటి స్థానంలో ఉందని “క్లైమేట్ ట్రేస్” వెల్లడించింది.
*✳️జాతీయ వార్తలు:*
📌 శబరిమల అయ్యప్ప దర్శన అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, కేరళలోని పతనంతిట్ట జిల్లా అధికారులు ముత్తూట్ గ్రూప్ సహకారంతో అత్యాధునిక డిజిటల్ అసిస్టెంట్ స్వామి AI చాట్‌బాట్‌ను ప్రారంభించారు.
📌రైల్వే ఆవరణలో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్‌లకు ఆదేశాలు జారీ చేసింది.
📌ఆస్ట్రేలియా యొక్క వోలాంగాంగ్ విశ్వవిద్యాలయం నిన్న గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో తన క్యాంపస్‌ను ప్రారంభించింది.
*✳️రాష్ట్ర వార్తలు:*
📌 ఎస్సీ వర్గీకరణపై నిర్దిష్ట సిఫార్సులను సూచించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించింది.
📌వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక ప్రాథమిక పాఠశాలలు, మోడల్ ప్రైమరీ స్కూల్స్ పేరుతో రెండు రకాల ప్రాథమిక పాఠశాలలను నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ తెలియజేశారు.
*✳️క్రీడా వార్తలు:*
📌భారత క్రికెటర్స్ సంజూ శాంసన్, తిలక్ పవర్ హిట్టింగ్ తో రికార్డ్ పరుగుల తేడాతో 4వ మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికాపై గెలిచి సిరీస్ ను 3-1 తేడాతో గెలిచింది.
📌ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా నిన్న నోయిడాలో జరిగిన మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్ 52-31తో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందగా, మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 32-24తో గుజరాత్ జెయింట్‌పై విజయం సాధించింది.
Update #2
ఈ సమావేశంలో ముఖ్యాంశాలు;
– *మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ డిసెంబర్ 5న నిర్వహిస్తారు*
– *డిసెంబర్ నెలలో విద్యాశాఖ మంత్రి గారు ఉపాధ్యాయ సంఘాలతో డ్రాప్ట్ ప్రతిపాదనలపై, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ పై సమావేశం నిర్వహిస్తారు*.
– *సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు డిసెంబర్ 9 నుంచి 14 వరకు నిర్వహిస్తారు*
– రోడ్ మ్యాప్ అండ్ టీచర్ సర్వీసెస్:
– నవంబర్ 30న జీవో 117 రద్దు పై, ట్రాన్స్ఫర్ కోడ్ పై ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తారు.
– టీచర్ ప్రొఫైల్ అప్డేషన్ కు మొదటిది విడతగా డిసెంబర్ 20 వరకు, రెండో విడత గారు జనవరి 20 వరకు, మూడవ విడతగా ఫిబ్రవరి 10 వరకు అవకాశం ఇస్తారు.
– టీచర్ ప్రొఫైల్ అప్డేషన్ బట్టి ప్రమోషన్లు సీనియారిటీ లిస్టు తయారు చేస్తారు.
– ఫిబ్రవరి 10 తర్వాత అవకాశం ఇవ్వరు.
– ట్రాన్స్ఫర్ షెడ్యూల్:
– ప్రధానోపాధ్యాయులకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకు, స్కూల్ అసిస్టెంట్లకు ఏప్రిల్ 21 నుంచి 25 వరకు, ఎస్ జి టి లకు మే ఒకటి నుంచి పది వరకు నిర్వహిస్తారు.
– ప్రమోషన్ షెడ్యూల్:
సీనియార్టీ లిస్టులను మొదటి విడుదల ఫిబ్రవరి 15, రెండవ విడతగా మార్చి 1 మూడో విడతగా మార్చి 15న డిస్ప్లే చేస్తారు.
– *డీఎస్సీ రిక్రూట్మెంట్ మే 11 నుంచి 30 లోపు ముగిస్తారు*
–
– *జీవో 117 ను రద్దుచేసి మార్పుకు సంబంధించి డ్రాఫ్ట్ ప్రతిపాదనలు సంఘాలకు తెలియజేయడం జరిగింది*.
– ప్రాథమిక పాఠశాలలు రెండు రకాలుగా అనగా బేసిక్ ప్రైమరీ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్ గా ఉంటాయి.
– బేసిక్ ప్రైమరీ స్కూల్స్ లో 30 వరకు ఒక టీచర్, ప్రతి 30 మందికి ఒక టీచర్ ను నియమిస్తారు.
– మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు ఇస్తారు. వంద మంది విద్యార్థులు దాటిన పాఠశాలకు ఒక పిఎస్ హెచ్ఎం కేటాయిస్తారు.
– 13000 పంచాయతీలకు గాను 6000 పంచాయితీలు పైగా మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేస్తారు.
– ప్రాథమికోన్నత పాఠశాలలో 6 ,7, 8 తరగతి విద్యార్థులు 60 మంది దాటితే ఉన్నత పాఠశాలలుగా అప్ గ్రేడ్ చేస్తారు.
– 6, 7 ,8 తరగతుల విద్యార్థులు 30 కన్నా తక్కువ ఉంటే ప్రాథమిక పాఠశాలగా కొనసాగిస్తారు.
– ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తర్వాత విద్యార్థులు 31 నుంచి 59 వరకు ఉంటే వాటిని కొనసాగించడం గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
– ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 75 దాటిన పాఠశాలలకు గ్రేడ్ II హెడ్మాస్టర్ పోస్టు, పిడి పోస్ట్ కేటాయిస్తారు.
– సెక్షన్ల వారీగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు.
– ఉపాధ్యాయులకు పనిభారం 36 కు మించకుండా ప్రయత్నం చేస్తారు.
– నవంబర్ 30 నాటికి డ్రాఫ్ట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తారు.
– క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారు.
బదిలీలకు సంబంధించి ప్రతిపాదనలు:
– టీచర్స్ కు కనీసం రెండు సంవత్సరాలు గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి.
– గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులకు కనీసం రెండు సంవత్సరాలు గరిష్టంగా ఐదు సంవత్సరాలు.
– స్కూల్ క్యాటగిరీలను 16% చేరి వాటిని కేటగిరి A గా ఒక పాయింట్, 12% హెచ్ఆర్ఏ పాఠశాలలను కేటగిరి B గా రెండు పాయింట్లు, 10% హెచ్ఆర్ఏ స్కూళ్లలో 5000 జనాభా పై ఉన్న ప్రాంతాలను కేటగిరి C గా మూడు పాయింట్లు, 10% హెచ్ఆర్ఏ స్కూళ్లలో 5000 కన్నా జనాభా తక్కువ ఉన్న ప్రాంతాలను కేటగిరి D గా నాలుగు పాయింట్లు కేటాయిస్తారు.
– సర్వీస్ పాయింట్ ఒక సంవత్సరానికి ఒక పాయింట్ కేటాయిస్తారు(గతంలో 0.5 గా ఉండేది)
– స్పెషల్ కేటగిరి పాయింట్లు అన్ మ్యారీడ్ ఉమెన్, పీహెచ్ 40 నుండి 69 శాతం వరకు, 15 సంవత్సరాల లోపు పిల్లల గల వితంతువులకు, భార్య మరణించిన పురుష ఉపాధ్యాయులకు, NCC, కేంద్ర భద్రత బలగాల పనిచేస్తున్న వారి స్పౌజ్ కు, ఎక్స్ సర్వీస్ మెన్ కు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర మరియు 26 జిల్లాల బాధ్యులకు ప్రత్యేక పాయింట్లు కేటాయిస్తారు.
– పీహెచ్ 70% కన్నా ఎక్కువ ఉన్న ఉపాధ్యాయులకు, క్యాన్సర్, డయాలసిస్, అవయవ మార్పిడి చేసుకున్న తదితర ఎక్కువ తీవ్రత గల వ్యాధులతో బాధపడుతున్న వారిని. ప్రిఫరెన్షియల్ క్యాటగిరీ కింద తీసుకుంటారు
– POCSO కేసులు, డిసిప్లనరీ యాక్షన్స్ ఉన్న టీచర్లకు మైనస్ పాయింట్లు ఇస్తారు.
– పర్ఫామెన్స్ పాయింట్లు పై ఇంకా చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
– డీఎస్సీ నోటిఫికేషన్ మరో 10 రోజుల లోపు ప్రజలు కావచ్చు అని తెలియజేశారు.
– పాఠశాలల సమయాన్ని 9 నుంచి 5 వరకు ప్రార్థన సమయం, ఇంటర్వెల్, లంచ్ బ్రేక్ సమయాలను పెంచి నిర్వహిస్తే ఎలా ఉంటుందని అభిప్రాయం క్షేత్రస్థాయిలో కూడా తెలుసుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు.
Update #1 – AP schools SA 1 TIME TABLE 2024-25
(1-5th 10 AM TO 12.30 PM)
09/12/24—TELUGU
10/12/24—ENGLISH
11/12/24—MATHS
(6 & 8 th 9.30AM TO 12.45 PM)
09/12/24—TELUGU
10/12/24—HINDI
11/12/24—ENGLISH
12/12/24—MATHS
13/12/24—EVS & PS & NS
14/12/24—SS
(7th & 9 th &10th 1.30PM TO 4.45 PM)
09/12/24—TELUGU
10/12/24—HINDI
11/12/24—ENGLISH
12/12/24—MATHS
13/12/24—EVS & PS & NS
14/12/24—SS.