PAN అంటే పర్శింనెట్ అకౌంట్ నంబర్. ఈ నంబర్ పది డిజిట్లలో ఉంటుంది. అది కూడా అల్ఫా న్యూమరిక్ రూపంలో ఉంటుంది. ఈ నంబర్ ముద్రించిన ప్లాస్టిక్ లామినేటేడ్ కార్డ్‌ను ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అందచేస్తుంది.
దీనినే పాన్ కార్డ్ అంటారు. ఇది మీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ సైజ్‌లో ఉంటుంది. ఈ కార్ట్ పై మీ వ్యక్తిగత వివరాలు నమోదై ఉంటాయి. అంటే మీ పేరు, మీ తండ్రిపేరు, మీ పుట్టినరోజు, పాన్ నంబర్, మీ సంతకం మరియు మీ ఫొటో ఉంటుంది. పాన్ కార్డ్‌పై గల పది అల్భా న్యూమరిక్ రూపంలో ఉండే అక్షరాలలో మొదటి. 5 అక్షరాలు: ఆంగ్ల అక్షరాలు, తర్వాత గల నాలుగు. అక్షరాలు సంఖ్యలు మరియు చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది. ఈ పది అక్షరాలను ఐదు భాగాలుగా విభజించడమైనది.

Pan Card structure
- మొదటి మూడు అక్షరాలుగా AAA to ZZZ గా ఉంటాయి.
- నాలుగవ అక్షరం పాన్ కార్డ్ హోల్డర్ యొక్క స్థితిని తెలియచేస్తుంది.
- C-Company
- P-Person
- H-HUF(Hindu Undivided Family)
- F-Firm
- A-Association of Persons(AOP)
- T-AOP(Trust)
- B-Body of Individuals(BOI)
- L-Local Authority
- J-Artificial Judicial Person
- G-Government
- ఐదవ అక్షరం పాన్ కార్డ్ హోల్టర్ ఇంటి పేరులోని మొదటి అక్షరమును తెలియచేస్తుంది.
- తర్వాత నాలుగు అక్షరాలు అంకెలలో 0001 నుండి 9999 వరకు ఉంటాయి.
- చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది.
Who needs a PAN Card? పాన్ కార్డ్ ఎవ్వరికి అవసరం?
మీ ఆదాయం ఇన్ కమ్ టాక్స్ చెల్లించే పరిమితిలో కనుక ఉంటే మీరు ఇన్ కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి మీకు పాన్ కార్డ్ అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్స్‌లో మీ పాన్ కార్డ్ నంబర్ తెలియచేయవలసి ఉంటుంది. అంతే కాకుండా క్రింది సమయాలలో పాన్ కార్డ్ లేదా పాన్ నంబర్ తప్పనిసరి.
మీ ఆదాయ వన్ను వ్యవహారాలలో, ఐటి డిషార్ట్ మెంట్ తో ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుటకు,
అన్ని రకాల చలాన్స్ కట్టే సమయంలో
డిమ్యాట్ అకౌంట్ ప్రారంభించడానికి
ఏదైనా ఆస్థి అమ్మదం లేదా కొనుగోలు చేయు సమయంలో
కారు కొనే సందర్భంలో
యాభై వేల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపే సమయంలో
బ్యాంక్ లో ఖాతా ప్రారంభించడానికి
మ్యుచవల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయు సమయంలో
యాభై వేల కంటే పైన డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొనుటకు
అంతే కాకుండా వివిధ సందర్భాలలో పాన్ కార్డ్ మీ వ్యక్తిగత గుర్తింపు కార్డ్‌గా. కూడా ఉపయోగపడుతుంది.
చాలా మంది పాన్ కార్ట్ అంటే కేవలం ఆదాయప్తు పన్ను గురించి అనే అపోహలోనే ఉంటారు. కాని అది ఎంత మాత్రం వాస్తవం కాదు. ఆదాయపు పన్నుకోసం పాన్ నంబర్ ఉంటే సరిపోతుంది కాని, పాన్ కార్డ్ అవసరం లేదు.
పాన్ కార్ట్ యొక్క పొటో కాపీలు మాత్రం మీ ఆర్థిక లావాదేవీల సమయంలో అవసరం తప్పకుండా ఉంటుంది. పాన్ కార్ట్ కోసం ఎవ్వరైనా వయస్సు, భాష మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
How to apply for a PAN CARD?
మీరు ఏదైనా పాన్ కార్డ్ సర్వీస్ నెంబర్ లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. పాన్ కార్డ్ దరఖాస్తుతో పాటు క్రింది వాటిలో నుండి ఏదైనా రెండు మీ ఐడెంటిటి మరియు అడ్రస్ ప్రూప్స్ కోసం అందచేయవలెను.
-Matriculation Certificate
-Recognized Educational Institute Degree
-Credit Card
-Bank Statement
-Ration Card
-Driving License
-Voter’s Identity Card
-Passport