PEN – PERMANENT EDUCATION NUMBER.
APAAR – AUTOMATED PERMANENT ACADEMIC ACCOUNT REGISTRY.
What is PEN number?
PEN అనేది ఒక విద్యార్థి తన జీవితకాలములో నర్సరీ నుండి ఎంత వరకు చదువుకోవాలి అనుకున్న ప్రతీ సారి కొత్తగా తాను జాయిన్ అయ్యే పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, ప్రొఫెషనల్ కోర్సెస్ లో అన్నీ డాక్యూమెంట్స్ ఇవ్వడం వాటిని వాళ్ళు చెక్ చేయడం, మరియు హార్డ్ కాపీలు చెక్ చేయడం తదితర ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్ గా ఆన్ లైన్ లో చెక్ చెక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసిన విధానం. ఒక్కసారి విద్యార్థికి PEN నెంబర్ జనరేట్ అయితే జీవితకాలము అదే నెంబర్ పర్మనెంట్ గా ఆధార్ నెంబర్ లాగా ఉంటుంది.
What is APAAR number?
APAAR అనేది ప్రతీ విద్యార్డికి ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహంఇవ్వాలి అన్నా దీని ఆధారముగా అన్నీ జనరల్ ప్రొఫైల్ డీటెయిల్స్ చెక్ చేసుకొని తద్వారా ఇవ్వడం జరుగుతుంది. APAAR ఒక్కసారి జనరేట్ అయితే ఎటువంటి పరిస్థితిలో చేర్పులు, మార్పులు చేయకుండా డూప్లికేట్ విద్యార్థులుకు ప్రభుత్వం తమ ప్రోత్సాహంలు తీసివేసేoదుకు ఏర్పాటు చేసిన విధానం. దీని ద్వారా మన రాష్ట్రములో షుమారుగా 2లక్షలు వరకు ఉన్న డూప్లికేట్ విద్యార్థుల డీటెయిల్స్ తీసివేస్తారు. తద్వారా ప్రభుత్వంకు కొన్ని వేల కోట్ల నగదు స్కాలర్షిప్ మరియు స్కూల్స్ మెయింటినెన్స్, ఇతర హాస్టల్ ఫీజులు, తల్లికి వందనం తదితర మొత్తం మిగులుతుంది. అందుకే ప్రభుత్వం అప్పటి కప్పుడు ఈ పథకాన్ని అమలులోకి తీసుకొని వచ్చారు.
ధన్యవాదములు.