YouTube Premium Lite Plan: ప్రకటనలతో ఇబ్బంది పడుతున్నవారికోసం నయా ప్లాన్

గూగుల్ సంస్థ యూట్యూబ్ యూజర్ల కోసం కొత్త “ప్రీమియం లైట్ ప్లాన్” ని తీసుకువస్తోంది. ఇది ముఖ్యంగా యూట్యూబ్ మ్యూజిక్ వంటి ఇతర సేవలను ఉపయోగించని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఎటువంటి ప్రకటనలు లేకుండా వీడియోలు చూస్తూ అనుభవించవచ్చు. కానీ, ఈ ప్లాన్‌లో మ్యూజిక్ వీడియోలకు అందుబాటులో ఉండదు.
ప్రస్తుతం ఈ ప్రీమియం లైట్ ప్లాన్ అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, థాయిలాండ్ వంటి దేశాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ యూజర్లకు ప్రకటనల నుండి విముక్తి కల్పిస్తూ, కంటెంట్‌ను క్షీణించకుండా చూసే అవకాశం అందిస్తోంది.
గతంలో కూడా యూట్యూబ్ తక్కువ ధరలో ప్రీమియం ప్లాన్ ని అందించింది. 2021లో, కొన్ని యూరోపియన్ దేశాల్లో (బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్) ఈ ప్రీమియం లైట్ ప్లాన్ ప్రారంభించబడింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ప్రకటనలు లేకుండా వీడియోలు వీక్షించగలుగుతున్నారు, అయితే ఆఫ్లైన్ డౌన్లోడ్లు, ప్లే బ్యాక్, యూట్యూబ్ మ్యూజిక్ వంటి సేవలు అందుబాటులో ఉండలేదు.
2023 అక్టోబర్ లో ఈ ప్లాన్ యూట్యూబ్ నిలిపివేసింది. వినియోగదారుల అభిప్రాయాలు, భాగస్వాముల నుంచి వచ్చిన ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకొని, కొత్త విధానంతో ఈ ప్లాన్ ను తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్లాన్ అందుబాటులో వచ్చిన తర్వాత, భారతదేశంలో కూడా ఇది అందుబాటులో ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం, భారతదేశంలో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ ధరలు ఇలా ఉన్నాయి:
- నెలకు ₹149
- మూడు నెలలకు ₹459
- ఏడాదికి ₹1490
అలాగే, ఐదు మందికి అదనపు సభ్యత్వం ₹299, మరియు విద్యార్థుల కోసం ₹89 నెలకు ప్రత్యేక ధరలతో ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ కొత్త ప్రీమియం లైట్ ప్లాన్, ప్రకటనలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు అద్భుతమైన ఆప్షన్ కావచ్చు.