మార్చి 2027 లో జరగనున్న SSC పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసింది!
రెగ్యులర్ మరియు గతంలో ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను ముందుగా UDISE+ లాగిన్‌లో సరిచూసుకొని, నిర్దేశిత గడువులోగా అధికారిక వెబ్‌సైట్ (https://bse.ap.gov.in) ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
🗓 ఫీజు చెల్లింపు తేదీలు:
▪️ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా: 11-11-2026 నుండి 25-11-2026 వరకు
▪️ ₹50/- ఆలస్య రుసుముతో: 26-11-2026 నుండి 02-12-2026 వరకు
▪️ ₹200/- ఆలస్య రుసుముతో: 03-12-2026 నుండి 09-12-2026 వరకు
▪️₹500/- ఆలస్య రుసుముతో: 10-12-2026 నుండి 15-12-2026 వరకు
💵 పరీక్ష ఫీజు వివరాలు :
▪️ రెగ్యులర్ విద్యార్థులకు (అన్ని సబ్జెక్టులు / 3 కంటే ఎక్కువ): ₹125/-
▪️ 3 సబ్జెక్టుల వరకు: ₹110/-
▪️ ఒకేషనల్ విద్యార్థులకు: అదనంగా ₹60/-
▪️ వయోపరిమితి సడలింపు రుసుము (Underage students): ₹300/-
⚠️ ముఖ్యమైన గమనిక:
▪️ ఫీజు చెల్లింపులు కేవలం స్కూల్ లాగిన్ (https://bse.ap.gov.in) ద్వారా మాత్రమే చేయాలి. CFMS లేదా బ్యాంక్ చలానాలు అంగీకరించబడవు.
▪️ ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి తేదీలను పొడిగించబోరు. కాబట్టి చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా సకాలంలో ప్రక్రియ పూర్తి చేయగలరు.
▪️ మాన్యువల్ నామినల్ రోల్స్ (MNRs) సమర్పించాల్సిన అవసరం లేదు.