నేటి విద్యా వార్తలు ▪️SA 1 పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవుతాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి…


నేటి విద్యా వార్తలు
▪️SA 1 పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవుతాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు.
▪️E SR ఆన్లైన్ సబ్మిషన్ కు నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఉన్నది. ఈ లోగా ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా E SR పూర్తి చేసుకోవాలి. E SR పూర్తయి…అప్రూవ్ అయిన వారికి ఇక ఫిజికల్ ఎస్సార్ లో నమోదు ఉండదు. కేవలం ఆన్లైన్లో మాత్రమే నమోదు జరుగుతుంది.
▪️తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు నిన్నటితో ముగిసింది. తిరిగి రెండవ పేజ్ లో నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు నూతన ఓటర్లను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఓటు నమోదు చేసుకోని ఉపాధ్యాయులు సంబంధిత పత్రాలతో సిద్ధంగా ఉండాలి.
▪️ఒక వారం రోజుల్లో TaRL 100 రోజుల ప్రణాళిక విడుదల కావచ్చు. దీనిని అనుసరించి విద్యార్ధులను వారి స్థాయిని బట్టి గ్రూప్ గా బోధన చేయాలి.
▪️2003 DSC పాత ఫించన్ గైడ్ లైన్స్ ఫైల్ ఆమోదం పొందింది. నేడు లేదా రేపు ఉత్తర్వులు విడుదల అవుతాయి.
▪️AP SCHOOL EDUCATION DRAFT SENIORITY LIST లు విడుదలైనవి. గెజిటెడ్ క్యాడర్ వరకూ ఈ లిస్ట్ లు విడుదల అయినవి. అభ్యంతరాలు ఉంటే 10-11-26 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros